Rakshasudu Song

పల్లవి:

మళ్ళి మళ్ళి ఇది రాని రోజు.. మల్లి జాజి అల్లుకున్న రోజు..
జాబిలంటి ఈ చిన్నదాన్ని .. చూడకుంటే నాకు వెన్నెలేది
ఏదో అడగాలని,
ఎంతో చెప్పాలని,
రగిలే ఆరాటంలో..వెళ్ళలేను..ఉండలేను..ఏమి కానూ
మళ్ళి మళ్ళి ఇది రాని రోజు..
మల్లి జాజి అల్లుకున్న రోజు..

చరణం:1

చేరువైన రాయబారాలే, చెప్పబోతే మాట మౌనం..
దూరమైన ప్రేమ ధ్యానాలే, పాడలేని భావ గీతం..
ఎండల్లో వెన్నెల్లో ఎంచేతో,
ఒక్కరం ఇద్దరం అవుతున్నాం
వసంతాలు ఎన్నొస్తున్నా,కోకిలమ్మ కబురేది
గున్నమావి విరబుస్తున్నా, తోట మాలి జాడేది
నా ఎదే తుమ్మెదై సన్నిధే చేరగా
మళ్ళి మళ్ళి ఇది రాని రోజు..
మల్లి జాజి అల్లుకున్న రోజు..

చరణం:2

కళ్ళనిండా నీలి స్వప్నాలే, మోయలేని వింత మోహం..
దేహమున లేవు ప్రాణాలే, నీవు కాదా నాకు ప్రాణం
సందిట్లో ఈ మొగ్గే పూయనీ..రాగాలే బుగ్గల్లో దాయనీ..
గులాబీలు పూయిస్తున్నా..తేనెటీగ అతిథేడి
సందెమబ్బులెన్నొస్తున్నా..స్వాతి చినుకు తడుపేది
రేవులో నావలా నీ జతే కోరగా
జాబిలంటి ఈ చిన్నదాన్ని .. చూడకుంటే నాకు వెన్నెలేది
ఏదో అడగాలని,
ఎంతో చెప్పాలని,
రగిలే ఆరాటంలో..వెళ్ళలేను..ఉండలేను..ఏమి కానూ
మళ్ళి మళ్ళి ఇది రాని రోజు..
మల్లి జాజి అల్లుకున్న రోజు..
లాల లాల లల లాలలల
ఊహు ఊహు..ఆహ అహ అహా......

Comments

Popular posts from this blog

Manmadhudu - gundello emundo song lyrics

Swayamkrushi song lyrics

Anthapuram song lyrics